AP news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్‌గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసినప్పుడు ఏపీఎస్ సంజయ్ పెద్ద ఎత్తున అవినీతి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ అధికారులు చేసిన లోతైన విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో, వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, ముఖ్యమంత్రి కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యని ఆలిండియా సర్వీసెస్ డిసిప్లేన్ యాక్ట్ (1969) సెక్షన్ 3(1) కింద తీసుకున్నారు.
అలాగే, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులను విచారణ చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో, ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ అవినీతిపై విచారణ ముమ్మరం చేసారు.
యాంటీ కరెప్షన్ యాక్ట్ 17A ప్రకారం, ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారి అనుమతి అవసరం. ఈ క్రమంలో, ఏసీబీ అధికారులు సర్కార్‌ను రిక్వెస్ట్ చేసి, సంజయ్‌పై ప్రాసిక్యూషన్ తీసుకోవడానికి అనుమతి కోరారు.
సంజయ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు శనివారం జారీచేసింది. విచారణ అనంతరం నేడు లేదా రేపు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది.