Encounter:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మళ్లీ కాల్పుల మోత సంచలనం రేపుతున్నది. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 20 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీస్ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ భీకర ఎన్‌కౌంటర్ గురువారం ఉదయం జరిగినట్టు సమాచారం.
Encounter:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దుల్లో గురువారం ఉదయం భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో అండ్రి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, తెల్లవారుజామున 7 గంటలకు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి.
Encounter:ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమవగా, ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది ఒకరు ప్రాణాలిడిచినట్టు తెలిపారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు.