Encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నది. ఈ ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇదే ఎన్కౌంటర్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మరికొంత మంది మావోయిస్టులు, జవాన్లు గాయాలపాలైనట్టు సమాచారం.
Encounter: ఇటీవల వరుస ఎదురుకాల్పుల ఘటనలతో మావోయిస్టుల కదలికలు తగ్గిపోతున్నాయి. అయితే పూర్తిగా మావోయిస్టులను తుద ముట్టించాలనే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఎక్కడ అలికిడి కలిగినా క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.
Encounter: ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లోనే పదుల సంఖ్యలో వరుసగా మావోయిస్టులు హతమయ్యారు. పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోల డంపులు బయటపడ్డాయి. రహదారులపై ఏర్పాటు చేసిన మందుపాతరలను భద్రతా దళాలు గుర్తించి విచ్ఛిన్నం చేశారు. తాజాగా ఘటనతో మావోయిస్టులకు తీరని ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు చనిపోవడం ఇటీవల జరిగిన ఘటనల్లో ఇదే కావడం గమనార్హం.