Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుదార్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీనితో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరోవైపు, ఒక అధికారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు, అక్కడ ఇంకా ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్లు అనుమానిస్తున్నారు.
ఇటీవల కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. గత వారం కూడా ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టేందుకు భద్రతా బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానిక ప్రజలు కూడా భద్రతా బలగాలకు సహకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ ముగిసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Based on specific intelligence, #encounter has started in Guddar forest of #Kulgam. SOG of J&K Police, Army and CRPF on job. Further details to follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 8, 2025