Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో జరిగిన ఈ తాజా ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో గత రెండు రోజుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఏడుకు చేరింది.

రెండు రోజుల్లో ఏడుగురి మృతి: ఆపరేషన్ కొనసాగింపు
తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో నక్సల్స్ కదలికలు ఉన్నాయని, ముఖ్యంగా మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. నిన్న కూడా ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవుల్లో భీకర ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *