Encounter: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మంగళవారం (మే 13) ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనో ముగ్గురు ఉగ్రవాదులు హతం హతమయ్యాడు. మరో ఇద్దరిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.
Encounter: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పోషియాన్ జిల్లాలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఇద్దరు ఉన్న ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టాయి. ఆ ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఆ తర్వాత వారిని కూడా భద్రతా దళాలు హతమార్చాయి.
Encounter: పోషియాన్ జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, పారా మిలిటరీ దళాలు మంగళవారం ఉదయం ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తొలుత కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఆ తర్వాత పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Encounter: తాజా ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడ ఎదురు కాల్పులు జరిగినట్టు సమాచారం. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. భారత్, పాక్ కాల్పుల విరమణ సమయంలో మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడటంపై కలకలం రేపింది.