Emraan Hashmi: ఓజీ సినిమాలో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన తాజా స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నటులు సెట్స్‌కు రారని చెప్పారు. ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Chiranjeevi: మెగాస్టార్‌కి విలన్‌గా బాలీవుడ్ డైరెక్టర్?
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రకు మంచి ప్రశంసలు అందాయి. సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయిన ఆయన నుంచి ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ వచ్చింది. నటులు సెట్స్‌కు లేట్‌గా రావడం సాధారణమే కానీ, చాలా మంది నటులు అసలు సెట్స్ కే రారని చెప్పారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఆ నటులు ఎవరోనని నెటిజన్లు చర్చిస్తున్నారు. ఓజీలో ఇమ్రాన్ పాత్రకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ స్టేట్‌మెంట్ మరింతమంది దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇండస్ట్రీలో పని డిసిప్లిన్ గురించి ఈ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్ పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో బాగా బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఈ వైరల్ కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది.

