ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశాడో ఓ ఉద్మోగి. శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్‌ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడది వైరలైంది.
ఉద్యోగి పంపిన రాజీనామా లేఖకు, మేనేజర్ ప్రత్యుత్తరం పంపిస్తూ.. తాను ఒకటి చెప్పదలచుకుంటే, మరొక రకంగా అర్థమైనదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగం విషయంలో ఇద్దరి అంచనాలు వేరు వేరుగా ఉన్నతలు వెల్లడించారు. ఆఫీసులో పని వాతావరణం నచ్చకుంటే రాజీనామా చేయడం చాలా ఉత్తమం అని కొందరు చెబుతుంటే.. మరికొందరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావని అంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా.. వారు కామెంట్స్ చేస్తున్నారు.