Emergency in Pakistan:

Emergency in Pakistan: పాక్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

Emergency in Pakistan: భార‌త్ దాడుల ప్ర‌భావంతో పాకిస్తాన్ దేశవ్యాప్తంగా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిచిపోయాయి. గురువారం రాత్రి భార‌త సైన్యం చేప‌ట్టిన దాడుల వివ‌రాల‌ను పాక్ శుక్ర‌వారం అధికారికంగా వెల్ల‌డించనున్న‌ది. మ‌రోవైపు పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లతో ఆ దేశ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం వ‌స్తున్న‌ది. దేశం మొత్తం అప్ర‌మ‌త్త వాతావ‌ర‌ణంలో చేరింది. ప‌లువ‌రు ప్ర‌జ‌లు కూడా సుర‌క్షిత ప్రాంతాలకు త‌ర‌లివెళ్తున్నారు.

Emergency in Pakistan: పాకిస్తాన్ ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్ర‌వాదుల‌కు వెన్నుద‌న్నుగా నిలిచి ఇప్పుడు చేజేతులా స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్న‌ది. ప‌హ‌ల్గాం ఉగ్ర దాడిని ఒక‌వేళ‌ ఖండించి, ఉగ్ర‌వాదుల ఏరివేత‌న‌కు త‌న వంతు సాయం చేస్తాన‌ని ఆనాడే ప్ర‌క‌టించి ఉంటే ఇంత స‌మ‌స్య వ‌చ్చి ఉండేది కాద‌ని స్వ‌యంగా పాక్ ప్ర‌జ‌ల్లోనే ఉన్న‌ది. ఉగ్ర‌వాదుల కోసమే ఏరికోరి ఆ దేశం ముప్పును తెచ్చుకున్న‌ది. గురువారం అర్ధ‌రాత్రి భార‌త్ ర‌క్ష‌ణ ద‌ళాల మెరుపు దాడితో ఆ దేశం అత‌లాకుత‌లం అయింది.

Emergency in Pakistan: ఉగ్ర‌వాదుల ప‌క్కా స‌మాచారంతో దాడులు చేసిన‌ట్టు భార‌త విదేశాంగ‌శాఖ అధికారి ప్ర‌కటించారు. సామాన్య పౌరులు లేని చోటే ఈ దాడుల చేసినట్టు ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌, బుధ‌, గురువారాల్లో పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో భార‌త్ గురువారం ఎదురుదాడికి దిగింది. ఏకంగా పాకిస్తాన్‌లోని 11 ప్ర‌ధాన న‌గ‌రాల‌పై మెరుపు దాడుల‌కు దిగింది. దీంతో ఆ దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. ఎమ‌ర్జెన్సీలో ఎలాంటి కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టాల‌నే విష‌యపై ఆ దేశ పాల‌కులు, ఉన్న‌తాధికారులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

Emergency in Pakistan: మ‌రోవైపు పాకిస్తాన్ సైన్యం దేశ స‌రిహ‌ద్దుల్లో భార‌త సైన్యంపై ఇప్ప‌టికీ కాలుదువ్వుతున్న‌ది. భార‌త సైన్యంపైనే కాకుండా, స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల‌పై పాక్ సైన్యం కాల్పుల‌కు దిగుతుంది. దీనికి భార‌త సైన్యం కూడా దీటుగా స‌మాధానం ఇస్తూ వ‌స్తున్న‌ది. పాకిస్తాన్ ఏదో అనుకుంటే అస‌లుకే న‌ష్టం వ‌చ్చేలా తెలిసి రావ‌డంతో ఆ దేశ పాల‌కుల‌పై ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు. అన‌వ‌స‌రంగా భార‌త్‌తో యుద్ధానికి కాలుదువ్విన‌ట్టుగా ఆ దేశ ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *