Elon Musk: ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాపార వ్యూహాలతో ప్రపంచ టెక్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేశారు. తాజాగా, తన సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ను తన స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’కు అమ్మే నిర్ణయం తీసుకున్నారు. ఈ డీల్ మొత్తం 33 బిలియన్ డాలర్లకు ముగిసినట్లు తెలిపారు.
ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ మార్గంలో జరిగిందని, దీని ద్వారా xAI మొత్తం 80 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుందని మస్క్ వెల్లడించారు. గతంలో 2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్, దానికి ‘ఎక్స్’గా మార్పు చేసి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇప్పుడీ తాజా వ్యాపార నిర్ణయం టెక్ ఇండస్ట్రీలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
Also Read: GT vs MI Preview: గుజరాత్‌పై ముంబై స్కెచ్ అదుర్స్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పు?
Elon Musk: ‘ఎక్స్’లో మస్క్ చేసిన మార్పులు ప్రారంభంలో వివాదాస్పదంగా మారినప్పటికీ, ఇప్పటికి అది స్థిరంగా ఎదుగుతూ ఉంది. కంటెంట్ మోడరేషన్ నిబంధనల సడలింపు, సిబ్బంది తగ్గింపు, గ్రోక్ ఏఐ వంటి ఫీచర్లు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తాజా వ్యాపార ఒప్పందంతో, మస్క్ ఏఐ ప్రపంచాన్ని తన వ్యూహాలతో మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.