Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ టెక్ దిగ్గజం యాపిల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కృత్రిమ మేధా (AI) స్టార్టప్ xAI ఎదుగుదలకి యాపిల్ అడ్డుకట్ట వేస్తోందని, చాట్‌జీపీటీకి (OpenAI) అనైతిక మద్దతు ఇస్తోందని మస్క్ ఆరోపించారు.
మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఇలా రాసుకొచ్చారు..
ఆపిల్ యాప్ స్టోర్‌లో ఓపెన్‌ఏఐ తప్ప మరే AI యాప్ కూడా #1 స్థానానికి రావడం అసాధ్యం అవుతోంది. ఇది స్పష్టంగా యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన. అందుకే xAI చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తోంది అని తెలిపారు.
ప్రస్తుతం యాప్ స్టోర్‌లో “టాప్ ఫ్రీ యాప్స్” జాబితాలో చాట్‌జీపీటీ అమెరికాలో అగ్రస్థానంలో ఉంది. xAI రూపొందించిన Grok యాప్ ఐదో స్థానంలో ఉండగా, గూగుల్ యొక్క Gemini 57వ స్థానంలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా చాట్‌జీపీటీ ముందంజలోనే ఉంది.
ఇది కూడా చదవండి: RGV: ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ
మస్క్ మరొక పోస్ట్‌లో, “X ప్రపంచంలోనే నంబర్ 1 న్యూస్ యాప్, Grok అన్ని యాప్‌లలో 5వ స్థానంలో ఉంది. అయినా, యాపిల్ ‘మస్ట్ హ్యావ్’ విభాగంలో X లేదా Grok ని ఎందుకు పెట్టడం లేదు? మీరు రాజకీయాలు చేస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.
టెక్నాలజీ రంగంలో AI పోటీ వేడెక్కుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల xAI “Grok 4” ను, అలాగే ఫోటోలు, వీడియోలు సృష్టించే “Grok Imagine” ఫీచర్‌ను విడుదల చేయడంతో, యాపిల్ ప్రొడక్టివిటీ కేటగిరీలో Grok ర్యాంక్ 60వ స్థానంనుంచి 2వ స్థానానికి చేరింది. అయినప్పటికీ, చాట్‌జీపీటీ ఎప్పటిలాగే మొదటి లేదా రెండవ స్థానంలోనే ఉంది.
యాపిల్ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై అధికారిక స్పందన ఇవ్వలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మస్క్ కోర్టును ఆశ్రయిస్తే, యాప్ స్టోర్ విధానాలు మాత్రమే కాదు, AI మార్కెట్‌లో కూడా పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Hey @Apple App Store, why do you refuse to put either 𝕏 or Grok in your “Must Have” section when 𝕏 is the #1 news app in the world and Grok is #5 among all apps?

Are you playing politics? What gives? Inquiring minds want to know. https://t.co/3wenLZGtwG
— Elon Musk (@elonmusk) August 11, 2025