Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై తప్పుడు ఆరోపణలు వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తోందని, అమెరికా ఉద్యోగాలను నాశనం చేస్తోందని ఆయన ‘ఎక్స్'(X) వేదికపై పోస్ట్ చేశారు. అయితే, ఈ వాదనలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ తన ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా తప్పు అని నిరూపించింది.
ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం దేశ ఇంధన భద్రత కోసమేనని, ఇది అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించడం కాదని స్పష్టమైంది. అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటోందని, నవారో ఆరోపణలు డబుల్ స్టాండర్డ్‌ను చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్‌పై నవారో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికను, దాని అధినేత ఎలాన్ మస్క్‌ను విమర్శిస్తూ, కమ్యూనిటీ నోట్స్‌ను చెత్త అని పిలిచారు.
Also Read: Donald Trump: భారత్ పై మరిన్ని సుంకాలు: ట్రంప్ మరో బిగ్ షాక్
ఎలాన్ మస్క్ ఈ వివాదంపై స్పందిస్తూ, ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ ఎవరినీ వదిలిపెట్టదు, తప్పుడు సమాచారాన్ని సరిచేస్తుంది అని పేర్కొన్నారు. గ్రోక్ ద్వారా మరింత ఖచ్చితమైన ఫ్యాక్ట్ చెకింగ్ అందిస్తాం, అని తెలిపారు. భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాలు ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. నవారో, బెసెంట్ వంటి వ్యక్తులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. నవారో వాదనలు తప్పుదారి పట్టించేవని, ఆధారాలు లేనివని స్పష్టం చేసింది.