Elon Musk

Elon Musk: ట్రంప్‌పై మస్క్ బాంబ్: ఎప్‌స్టైన్‌తో సంబంధాలపై సంచలన ఆరోపణలు

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఒకప్పుడు మిత్రులుగా కనిపించిన ఈ ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల రిపబ్లికన్‌ పార్టీ ప్రవేశపెట్టిన పన్ను బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. దానిపై స్పందించిన ట్రంప్, మస్క్ కంపెనీలు పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను రద్దు చేస్తానంటూ హెచ్చరించారు.

దీనితో మస్క్ బౌల్ట్‌లా ట్రంప్‌పై ఆరోపణలు మొదలుపెట్టారు. అతిపెద్ద లైంగిక దోపిడి కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు ట్రంప్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా, “ఎఫ్‌బీఐ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందని, అందుకే అవి బహిరంగంగా లేవు” అని మస్క్ ఆరోపించారు. అంతేకాదు, “ఇది బహిరంగం చేసే సమయం ఆసన్నమైంది” అని కూడా పేర్కొన్నారు.
Elon Musk: ఈ ఆరోపణలపై ట్రంప్ మాత్రం స్పందిస్తూ, ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని పేర్కొన్నారు. తనకు ఎప్‌స్టైన్‌తో ఎలాంటి సంబంధం లేదని, అతని ప్రైవేట్ జెట్‌లో తాను ప్రయాణించలేదని గతంలో చెప్పిన విషయాలను పునరుద్ఘాటించారు.

ఇతర అంశాల్లోనూ ఈ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మస్క్, “నా మద్దతు లేకుండా ట్రంప్ 2024 ఎన్నికల్లో గెలిచేవారు కాదని” వ్యాఖ్యానించారు. ట్రంప్ స్పందిస్తూ, “మస్క్ అవసరం లేకుండానే నేను పెన్సిల్వేనియాలో గెలిచే వ్యక్తినని” చెప్పారు. ఈ రాజకీయ విభేదాలు ఇంకా ఎటు దారి తీయనున్నాయో తెలియదు కానీ, ప్రపంచంలోని ప్రముఖ నాయకులు ఇద్దరి మధ్య ఇలా పరస్పర ఆరోపణలు చేయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *