Election Commission: దేశంలో ఎన్నికల విధానంలో కీలకమైన మార్పును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (EVMs)పై ఇప్పటివరకు కేవలం పార్టీ గుర్తులు మాత్రమే ఉండగా, ఇకపై అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా స్పష్టంగా కనిపించనున్నాయి. దీంతో ఓటర్లు అభ్యర్థిని గుర్తించడం మరింత సులభం కానుంది.
సవరించిన నిబంధనలు
-
పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి ఫోటో కూడా ఉంటుంది.
-
ప్రతి అభ్యర్థి పేరు పక్కనే సీరియల్ నంబర్ స్పష్టంగా ప్రదర్శించబడుతుంది.
-
ఈ మార్పులు ఓటర్లకు బ్యాలెట్ పేపర్ చదవడాన్ని సులభతరం చేస్తాయి.
ఇది కూడా చదవండి: Rajni-Kamal: యంగ్ డైరెక్టర్ చేతికి వెళ్లిన.. రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా
బిహార్ ఎన్నికల నుంచే అమలు
ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త నియమాలు తొలిసారిగా రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలులోకి రానున్నాయి. అంటే, ఆ ఎన్నికల నుంచి ప్రతి ఓటరు ఈవీఎంలో పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి ఫోటోను కూడా చూసి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
ఓటర్లకు ప్రయోజనం
ఇప్పటివరకు ఒకే రకమైన పార్టీ గుర్తులు లేదా పేర్లలో పోలికల వల్ల కొందరు ఓటర్లకు సందేహాలు తలెత్తేవి. ఇకపై అభ్యర్థి ఫోటో ఉండటం వల్ల, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, చదవలేని ఓటర్లకు కూడా సరైన గుర్తింపు లభించనుంది.