Mango Cheesecake: మీరు కూడా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడి, కొత్తగా మరియు ప్రత్యేకంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, ఈ మామిడి చీజ్‌కేక్ మీకు సరైనది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీన్ని తయారు చేయడానికి మీకు గుడ్లు, జెలటిన్ లేదా ఓవెన్ అవసరం లేదు. ఈ ఫ్రూట్-ఫ్రెష్, క్రీమీ మరియు నో-బేక్ మ్యాంగో చీజ్‌కేక్ యొక్క సులభమైన వంటకం గురించి తెలుసుకుందాం.
కేక్ పొరల కోసం కావాల్సిన పదార్ధాలు:
* మామిడిపళ్ల స్మూతీ – 3 కప్పులు,
* వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను
* క్రీమ్ చీజ్- 200 గ్రాములు
* క్రీమ్- 200 ఎంఎల్
* పంచదార- తీపికి సరిపడా
* జెలటిన్ పౌడరు- నాలుగున్నర కప్పులు.
ఇక కేక్ దిగువ పొరలకు కావలసిన పదార్థాలు:
* మ్యారీ గోల్డ్ బిస్కట్స్- 14,
* తేనె- మూడు స్పూన్లు,
* యాలకుల పొడి- పాపు స్పూను.
కేక్ తయారుచేసే విధానం:
ముందుగా బిస్కట్లను పొడిగా చేసుకోవాలి. దీనికి తేనె, యాలకుల పొడి కలిపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత వెడల్పైన పాన్‌ను తీసుకుని దాని లోపల వెన్నను పూతగా రాయాలి. తర్వాత పాన్ లో మిక్సీ వేసుకున్న బిస్కట్ల మిశ్రమాన్ని వేసి సమంగా పరచుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి.. ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు కేక్ కింద లేయర్ రెడీ అవుతుంది.
ఓ బౌల్‌లో చీజ్ క్రీమ్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత దీనిలో మ్యాంగో స్మూతీని వేసి.. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని బాగా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. ఇంతలో జెలటిన్ పౌడర్ ను కప్పులోకి తీసుకుని నీరుని కలిపి కొంచెం సేపు నానబెట్టాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో జెలటిన్ నీళ్లు, క్రీమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మేరీ గోల్డ్ బిస్కట్స్ తో తయారు చేసుకున్న మొదటి లేయర్ మీద పరచుకుని.. మళ్ళీ దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.. అలా ఓ నాలుగు గంటలు నాలుగు గంటలు ఉంచిన తర్వాత మ్యాంగో చీజ్ కేక్ రెడీ అవుతుంది. ఈ కేక్ పై క్రీమ్ తో పాటు ఇష్టమైన విధంగాఅందంగా అలంకరించుకోవచ్చు. ఒవేన్ లేకుండానే ఎంతో రుచిజీకరమైన టేస్టీ టేస్టీ మ్యాంగో చీజ్ కేక్ రెడీ.