Egg Freshness Test: ప్రోటీన్ల విషయంలో గుడ్డు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతీ వంటింట్లో గుడ్లు కామన్‌గా కన్పిస్తాయి. గుడ్లను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. అయితే చాలా మందికి గుడ్లు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా అనే డౌట్ వస్తుంటుంది. కానీ ఎలా తెలుసుకోవాలో తెలియదు. కొంత మంది వాటర్ టెస్ట్ ద్వారా గుడ్డు తాజాదనాన్ని గుర్తిస్తారు. అయితే ఈ ట్రిక్‌ను నమ్మడం కరెక్ట్ కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వాటర్ టెస్ట్..
చాల మంది వాటర్ టెస్ట్ ద్వారా గుడ్డు తాజాగా ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఒక గిన్నెలో నీటిని పోసి దాంట్లో గుడ్డు వేస్తారు. గుడ్డు తాజాగా ఉంటే అది నీటి అడుగున మునిగిపోతుంది. గుడ్డు ఫ్రెష్ కాకపోతే పైకి వస్తుంది. దీనినే ఎక్కువ మంది నమ్ముతారు. కానీ ఈ ట్రిక్ నమ్మదగినది కాదని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చెబుతోంది.
Egg Freshness Test: యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏమంటుందంటే..
గుడ్లు పైకి తేలితే అవి చెడిపోయినట్లు కాదని యూఎస్ అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు. గుడ్డులోని గాలి కణాలు విస్తరించినప్పుడు అది నీటిలో తేలుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి గుడ్లు పైకి తేలినా అవి తినొచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే గుడ్డు పగలగొట్టి చూడాలని సూచిస్తున్నారు. గుడ్డు చెడిపోయిందా లేదా అనేది వాసన, రూపాన్ని బట్టి నిర్ధారించుకోవాలని చెప్పారు. అంతకుముందు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సైంటిఫిక్ సెషన్‌లో గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ ప్రభావితం కావని తేలింది.
ఇది కూడా చదవండి: Coffee: కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందా..? షాకింగ్ సర్వే..
గుడ్లు తక్కువ తినాలి :
గుడ్లకు సంబంధించి గుండె సమస్యలతో బాధపడుతున్న 140 మంది రోగులపై జరిపిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వారానికి 12 ఉడికించిన గుడ్లు తినడంతో పోలిస్తే వారానికి రెండు గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని తేలింది. కాబట్టి గుడ్లను మితంగా తీసుకోవడం మంచిది.