Eega: ట్యాలెంట్ ఉంటే ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని ప్రూఫ్ చేశాడు జక్కన్న రాజమౌళి. ఈగ సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కూడా రాజమౌళి దీనిపై ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇక తాజాగా ఈగ మూవీ లాగే తమిళ తెలుగు భాషల్లో ‘లవ్లీ’ అనే సినిమా రాబోతోంది.’లియో’,’ప్రేమలు’ ఫేమ్ మాత్యువ్ థామస్ హీరోగా దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయగా అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక ఈగకు ఓ యువకుడితో స్నేహం కుదురుతుంది, అతనితో దోస్తీ చేసి ఎన్నో విషయాలు పంచుకుంటూ హీరోకు ఏదైనా సమస్య వస్తే సలహాలు ఇస్తూ, ఇబ్బందుల్లో పడితే ఆదుకుంటుంది ఆ ఈగ. అలా టీజర్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అచ్చం తెలుగు ‘ఈగ’ మూవీ లాగే ఉన్నాయి. స్టోరీ ఎక్కువ కూడా రివీల్ కాకుండా టీజర్ చాలా జాగ్రత్తగా ఎడిట్ చేశారు. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
