CM Chandrababu: ఆర్థిక అసమానతలు తగ్గి, సామాజిక చైతన్యం పెరిగినప్పుడే సమాజం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల విరాళంతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని (Maternal and Child Care Center) ఆయన ఈ రోజు ప్రారంభించారు.
ఈ భవన నిర్మాణానికి గుంటూరు మెడికల్ కాలేజ్ మాజీ విద్యార్థులు సుమారు రూ. 100 కోట్ల విరాళం అందించారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఇంత భారీ విరాళం అందడం సీఎం హర్షం వ్యక్తం చేశారు. మన సంస్కృతి ప్రకారం కేవలం మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తులు ఉండటం గర్వకారణమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మనం బాగుండడమే కాదు, చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి. సమాజ సేవకు ముందుకెళ్లి సహకరించిన జింఖానా సభ్యులు, పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. చదువు గేమ్‌చేంజర్ సాధారణ కుటుంబంలో పుట్టినా ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం అత్యంత అవసరం. పీ4 కార్యక్రమంలో పాల్గొని పేదరిక నిర్మూలనకు దోహదం చేయాలి అని పిలుపునిచ్చారు.
Also Read: Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్
విద్య, సాంకేతికత, పరిశ్రమల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలు ‘నాలెడ్జ్, ఎకానమీ కేరాఫ్’గా ఉండాలి అని అన్నారు. అమరావతి ఫ్యూచర్ సిటీగా, ‘క్వాంటం వ్యాలీ’ తరహా అభివృద్ధికి మార్గం చూపుతుందని ఆయన చెప్పారు. 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, పవర్ సెక్టార్ లో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల కరెంట్ కొరత రాకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు కూడా పాల్గొన్నారు.
