Education:దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందనడానికి ఈ ఒక్క ఆధారం చాలు. ఈనాడే కాదు.. దశాబ్దాలుగా ఇదే విధానం కొనసాగుతున్న చక్కబెట్టేవారు లేరు. ఇది ఇలాగే కొనసాగితే అసలు దిగజారే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నది. ఇది పాలకుల వైఫల్యమా? బ్యూరోక్రసీ నిర్లక్ష్యమా? ఉపాధ్యాయ వర్గం నిర్లిప్తతా? అనే విషయాన్ని పక్కన జరిగే నష్టాన్ని పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఈ సమాజానికి ఉన్నది.
Education:కేంద్ర విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లపై తాజాగా చేపట్టిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా 8,000 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరని తేలింది. ఆయా పాఠశాలల్లో సుమారు 20 వేల మందికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్టు లెక్కలు ఉన్నాయని తేలింది. 2024-25 విద్యాసంవత్సరంలో దాదాపు 8 వేల పాఠశాలల్లో అసలు ఒక్క విద్యార్థి కూడా చేరలేదని తేలింది.
Education:విద్యార్థులు లేని చోట ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉండగా, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఒక్క విద్యార్థి చేరని పాఠశాలల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండటం గమనార్హం.
Education:ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 33 లక్షల మంది విద్యార్థులు ఒకే టీచరు ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ తరహా పాఠశాలల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా, తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

