Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర ఆరోపణల సుడిలో చిక్కుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలతో లింక్‌తో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మహేష్‌కు నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలు వినియోగదారులను మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఈ సంస్థల ప్రమోషన్స్ కోసం మహేష్ రూ.5.9 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇందులో రూ.3.4 కోట్లు చెక్ ద్వారా, మిగతాది నగదుగా తీసుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ లావాదేవీలపై విచారణ కోసం మహేష్‌ను ఈ నెల 27న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
Also Read: Dragon: ‘డ్రాగన్’ హై ఓల్టేజ్ యాక్షన్.. మంగళూరులో దడ దడ!
Mahesh Babu: ఈ ఘటన టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మహేష్ బాబు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం మహేష్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఏమిటన్నది టాలీవుడ్ ఇండస్ట్రీ ఆత్రంగా ఎదురుచూస్తోంది.