Jr NTR: హాలీవుడ్‌లో నాలుగుసార్లు గ్రామీ అవార్డ్ సాధించిన సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్.. అతనితో పాటుగా ఫేమస్ బ్రిటిష్ సింగర్స్ ప్రస్తుతం ఇండియా టూర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో దేవర మూవీలోని చుట్టమల్లె పాటను పాడి అక్కడ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. షీరాన్ నోటి వెంట ఈ పాట వినడం తారక్ అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్ స్టా స్టోరీ లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram