ED Rides: ఇటీవలే విడుదలైన ఎంపురాన్ సినిమా నిర్మాతలలో ఒకరు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త గోకులం గోపాలన్ ఆస్తులపై శుక్రవారం ఈడీ అధికారులు సోదాలకు దిగారు. తమిళనాడు, కేరళలోని ఆయన కార్యాలయాలు, ఇండ్లపై ఈడీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. తొలుత గోపాలన్ కార్యాలయం ఉండే కొడంబాక్కంలోని ఆయన కార్యాలయంపై దాడికి దిగారు.
ED Rides: చిట్‌ఫండ్స్ ముసుగులో విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై వారు ఈ దాడికి దిగినట్టు తెలస్తున్నది. 2017లో కూడా ఇవే ఆరోపణలపై గోపాలన్ సంస్థలపై ఇదే రకమైన తనిఖీలు జరిగినట్టు తెలిసింది.
ED Rides: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రముఖమైన గోకులం చిట్‌ఫండ్స్‌కు ఈ గోకులం గోపాలన్ యజమాని కూడా కావడం గమనార్హం. దీంతో ఆయన సినరంగ ఆఫీసులతోపాటు, చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. గోకులం గోపాలన్ 2009లో చారిత్రక చిత్రమైన కేరళ వర్మ పఝస్సి రాజా, 2015లో కోలివుడ్ యాక్షన్ థ్రిల్లర్ తూంగా వనం సినిమాల నిర్మించి మలయాళంలో భాగా పేరు తెచ్చుకున్నారు.
ED Rides: మలయాళం అగ్రహీరో మోహన్‌లాల్ ఆ ఎంపురాన్ సినిమాలో హీరోగా నటించారు. ఇటీవలే విడుదలైన ఎంపురాన్ సినిమా వివిధ భాషల్లో విడుదలైంది. అయితే ఆ సినిమాల్లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని వివిధ ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆ మేరకు కొన్ని సంఘటనలు తొలగించారు. దాంతో కొంత మేరకు నష్టంవాటిల్లిందని చిత్ర నిర్మాత చెప్పారు.
ED Rides: ఇదిలా ఉండగా ఎంపురాన్ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగిన నేపథ్యంలోనే ఆ నిర్మాత.. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతే ఈ దాడులను పురికొల్పిందని వారు అంటున్నారు.
