Vijay Devarakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
ఇప్పటికే ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి తదితరులకు కూడా ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 6న విచారణకు హాజరు కావాలని మొదట ఆదేశించగా, సినిమా షూటింగ్‌లు, ముందస్తు కార్యక్రమాల కారణంగా విజయ్ హాజరుకాలేనని తెలియజేశారు. అందుకే కొత్త తేదీ ఇచ్చి, ఆగస్టు 11న కచ్చితంగా హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది.
ఇతరుల విచారణ తేదీలు
-
రానా దగ్గుబాటి – ఆగస్టు 11
-
ప్రకాశ్‌రాజ్ – జూలై 30
-
మంచు లక్ష్మి – ఆగస్టు 13
ఇది కూడా చదవండి: Dacoit: షాకింగ్! షూటింగ్‌లో హీరో, హీరోయిన్‌కు గాయాలు!
మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది.