EC To Congress: మహారాష్ట్రలో ఓటర్ల జాబితా అప్ డేట్ చేయడంలో అవకతవకలు జరిగాయి అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ అనంతరం పోలింగ్ శాతం పెరిగింది అంటూ కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఆరోపణలు చేసింది. రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, మహారాష్ట్ర యూనిట్ చీఫ్ నానా పటోలేతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం అన్ని సందేహాలను నివృత్తి పారదర్శకంగా నివృత్తి చేయాలని ఈసీని కోరింది.
దీనికోసం EC నుండి బూత్, నియోజకవర్గ స్థాయిలో రా డేటాను ఇవ్వాలని అడిగింది. కాంగ్రెస్ “పెద్ద ఎత్తున ఓటర్ల చేర్పులు -తొలగింపులు”, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగియడం – పోలింగ్ రోజు ముగిసే మధ్య ఓటింగ్ శాతంలో “అసాధారణమైన” అంతరం, చివరి పోలింగ్ శాతం – పోలైన ఓట్ల పెరుగుదల అంశాలను ప్రధానంగా ఎట్టి చూపించింది. ఇది
కూడా చదవండి: Earthquake: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూకంపం..
EC To Congress: సమావేశం అనంతరం సింఘ్వీ మాట్లాడుతూ.. ఓటరు జాబితాల నుంచి లక్షలాది మంది ఓటర్లను తొలగించడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కమీషన్ దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు. దాని ప్రతిస్పందనగా, EC ఓటరు జాబితాలో చేర్పులు సాధారణ జనాభా పెరుగుదల 2%కి అనుగుణంగా ఉన్నాయని, 18-19 సంవత్సరాల వయస్సు గల కొత్త ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. “అసాధారణంగా అధిక తొలగింపులు” అనే వాదనలపై, CEC రాజీవ్ కుమార్ చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున 2,000-3,000 కంటే ఎక్కువ తొలగింపులు జరగలేదని,
వీటిలో చాలా వరకు చనిపోయిన ఓటర్ల పేర్లే ఉన్నాయని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీల పరిశీలనకు ముసాయిదా ఓటర్ల జాబితా అందుబాటులో ఉందని కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి ఈసీ గుర్తు చేసింది. “అప్పుడు ఈ అభ్యంతరాలు ఎందుకు లేవనెత్తలేదు?” అంటూ ప్రశ్నించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలకు ముందు జాబితాను అప్‌డేట్ చేయబడుతున్న ఢిల్లీలో మీ అభ్యంతరాలను చెప్పండి. అప్పుడు ఎన్నికలకు ముందుగానే పొరపాట్లు ఉంటె సరిచేసుకోవచ్చని ఈసీ కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి సూచించనలు చెబుతున్నారు.