Eatala Rajendar: ఓటరు జాబితాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపైనా కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఓటరు జాబితాల్లో పేర్ల తొలగింపుపై కాంగ్రెస్ ఆరోపణలు సరికాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు, కాంగ్రెస్ ఓడిపోతే ఈవీఎంలు పనిచేయనట్టానట్టా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
Eatala Rajendar: కరీంనగర్‌లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీ జరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఓట్లు, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతనే ఫణంగా పెట్టజూస్తున్నదని ఆరోపించారు. ఈ విషయాలపై కాంగ్రెస్ నేతల వైఖరి సరికాదని హితవు పలికారు.
Eatala Rajendar: ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆ సంస్థ నిర్ణయాలు స్వతంత్రంగానే ఉంటాయని తేల్చి చెప్పారు. ఓట్లు, ఈవీఎంల అంశంపై పార్టీలకు, ప్రభుత్వానికి సంబంధాలు ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే గెలిచిందని, ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు.