Eatala Rajendar: ఉప్పల్ లో కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు…
కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తెస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రేవంత్ రెడ్డి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడని మల్కాజ్గిరి ఎంపీ, బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గం లోని రామంతపూర్ పరిధిలోగల మూసి పరివాహ ప్రాంతంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు… ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మూసి నదిని సుందరీకరించే పేరుతో, పునర్జీవనం పేరుతో పేదల కడుపు కొట్టి పెద్దలకు పెట్టే కుట్రలు చేస్తున్నారని అన్నారు.
మూసి పరివాహక ప్రాంతంలో 30, 40 సంవత్సరాల నుండి వేలాదిమంది పేదలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారని, ఎంత పెద్ద భారీ వర్షాలు పడ్డ ఎటువంటి వరదలు రాకుండా సురక్షితంగా ఉన్నారని గుర్తు చేశారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజలు నిద్రలేకుండా భయబ్రాంతులకు గురించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి పరివాహక ప్రాంత ప్రజల శవాల మీద నడుచుకుంటూ వెళ్లి ఐమాక్స్ లాంటి నిర్మాణాలు చేపట్టుకోవాల్సి వస్తుంది కానీ పేదలు ఇండ్లు కట్టుకోవద్ద అని ప్రశ్నించ్చాడు. మా గొంతులో ప్రాణం ఉండగా ఇక్కడి ఇండ్లను కూల్చనీయమని భరోసా ఇచ్చారు.
Eatala Rajendar: బీజేపీ పార్టీ ఈ పేదలకు అండగా ఉంటుందని, పార్టీ పరంగా ఇవ్వాల, రేపు మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఇండ్లను సందర్శించి, వారి మాటలను ప్రతిబింబించే విధంగా 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కానీ సుందరీకరణ పేరుతో కూల్చే ప్రయత్నం చేయొద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే Nvss ప్రభాకర్ బీజేపీ శ్రేణులు, మూసి పరివాహక ప్రాంతం బాధితులు పాల్గొన్నారు…