Earthquake: చిలీ-అర్జెంటీనా తీర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు అయ్యింది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
భూకంపం ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించగా, అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు.
ప్రస్తుతం స్థానిక ప్రభుత్వం, వైద్యం, రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
