America: అమెరికాలో భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.0గా నమోదయింది. గురువారం ఉదయం 10.44 గంటలకు ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేప్ మెండోసినో తీరంలో భూమి కంపించింది. పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉత్తర కాలిఫోర్నియా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది.
శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ ముందుజాగ్రత్తగా నీటి అడుగున సొరంగం నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల తీరం పొడవునా సునామీ వచ్చే అవకాశం ఉందని హోనొలులులోని సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అయితే కాసేపటికి హెచ్చరికలను ఉపసంహరించుకున్నది. భూ ప్రకంపనలు శాన్‌ఫ్రాన్సిస్కో వరకు వ్యాపించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ ముందుజాగ్రత్తగా నీటి అడుగున సొరంగం నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు