Earthquake Alert: రెండు తెలుగు రాష్ట్రాలకు భూకంప హెచ్చరికలు. అదీ ఈ నెల 10 నుంచి 17 తేదీల మధ్య వచ్చే అవకాశం. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండ్ల కేంద్రంగా ఏర్పాడే చాన్స్. ఇది ఇటు హైదరాబాద్, అటు అమరావతి వరకు వ్యాపిస్తుంది.. ఇవీ ఎపిక్ ఎర్త్ క్విక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ చేసిన హెచ్చరిక. రామగుండం కేంద్రంగా భూకంపం సంభవించే అవకాశం ఉన్నదని ఆ సంస్థ తేల్చి చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూకంపం ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి అన్న విషయాలను పరిశీలిద్దాం.
Earthquake Alert: ఇటీవల గత కొద్దిరోజులుగా మయన్మార్, బ్యాంకాక్ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో భారీ ప్రాణ, ఆస్తినష్టం కలిగింది. అయితే ప్రపంచంలో ఈ ఏడాది భారీ భూకంపాలు సంభవించి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తాయని ప్రముఖ ఆస్ట్రాలజర్లు కూడా చెప్పినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు భూకంప హెచ్చరికలు రావడంతో కొంత ఆందోళన కలిగిస్తున్నది.
Earthquake Alert: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ పూర్తిగా సింగరేణి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. ఎపిక్ ఎర్త్ క్విక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ సర్వేలో రామగుండం కేంద్రం భూకంపం ఏర్పడుతుందని హెచ్చరించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ గనుల కారణంగా ప్రమాద తీవ్రత ఇక్కడ అధికంగా ఉంటుందని సమాచారం.
Earthquake Alert: రామగుండం కేంద్రంగా భూకంపం వస్తే దాని ధాటికి ప్రకంపనలు వరంగల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి దాకా విస్తరించవచ్చు అని హెచ్చరికలు చేశారు. దీన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలోని ములుగు వద్ద గతంలో వచ్చిన భూకంప తీవ్రత 5గా నమోదైంది. దీని ప్రకంపనలు దాదాపు 200 కిలోమీటర్లు వరకు వ్యాపించాయి. రానున్న భూకంప తీవ్రత 7గా ఉండే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. అంటే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నది.
Earthquake Alert: ఇదిలా ఉండగా, ఈ హెచ్చరికలపై అధికారికంగా ధ్రువీకరణ లేదు. అందువల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. భూకంపాలను ముందుగా కచ్చితంగా ఊహించడం సాధ్యం కాదని కొన్ని పరిశోధన సంస్థలు తేల్చి చెప్తున్నాయి. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు భూకంప ప్రమాదం తక్కువగా ఉన్న జోన్-2, జోన్-3 లో ఉన్నాయి. అందువల్ల భూకంపాలు అరుదుగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు.