Ram Kapoor: హిందీ నటుడు రామ్ కపూర్ తాజాగా మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. లైంగికతను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను, చిత్ర బృందాన్ని నిరాశపరిచాయి. దీంతో ‘మిస్త్రీ’ సినిమా ప్రచార కార్యక్రమాల నుంచి ఆయనను తప్పించారు. అయినా, ఈ వివాదం రామ్‌కు ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టింది. గతంలో ఎన్నో సినిమాల్లో నటించినా, ఇప్పుడు ఆయన సంపాదన, ఆస్తులపైనే అందరి దృష్టి పెరిగింది.రామ్ కపూర్ విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరు. ముంబైలోని అలీబాగ్‌లో రూ.20 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, గోవా, ఖండాలాలో హాలిడే హోమ్స్ ఆయన సొంతం. రూ.4.57 కోట్ల లంబోర్గిని ఉరుస్‌తో పాటు హై-ఎండ్ కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయి. వివాదంపై స్పందిస్తూ, “నా వ్యవహారం ఓపెన్‌గానే ఉంటుంది. అయితే, అభ్యంతరకరంగా మాట్లాడకూడదని నేర్చుకున్నా” అని రామ్ అన్నారు. ‘బడే అచ్చే లగ్తే హై’, ‘ఘర్ ఏక్ మందిర్’, ‘కసం సే’ వంటి చిత్రాల్లో ఆయన నటన అభిమానులను ఆకట్టుకుంది.
