Crime News: హైదరాబాద్‌లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకుంది. సికింద్రాబాద్‌లోని ఓ పాత స్కూల్ భవనంలో రహస్యంగా మత్తు మందు తయారీ జరుగుతుందని సమాచారం రావడంతో, పోలీసులు అక్కడ దాడి చేశారు.
ఈ దాడిలో పెద్ద ఎత్తున రియాక్టర్లు ఏర్పాటు చేసి మత్తు మందు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తయారైన నిషేధిత మత్తు మందులను తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Google Gemini 3D Printing: జెమినీ 3డీతో జాగ్రత్త.. అశ్లీల ఫోటోలతో రావచ్చట…
పోలీసులు స్వాధీనం చేసుకున్న రసాయనాలు, రియాక్టర్లు, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా వెనుక ఉన్న ముఠా కార్యకలాపాలను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో మత్తు పదార్థాల అక్రమ తయారీపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఎలా ఏర్పడ్డాయి? ఎవరి సహకారంతో నడుస్తున్నాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.