Virat Kohli: కోహ్లీ అంటే ఎంతో గౌరవం అని .. క్రికెట్ లో అతనో అద్భుతమని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇటీవల అంతగా ఫామ్ లేకపోయినా అతణ్ని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నాడు. కాగా, కోహ్లి తన చివరి 60 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ఆరు టెస్టుల్లో అతని సగటు 22.72 మాత్రమే అయినా అయినా అతడికి అడ్డుకట్టవేయడం సవాలేనని చెబుతున్నాడు. ఈ సిరీస్ లో అతణ్ని ఔట్ చేయాలనుకుంటున్నానని, అది తనకు సాధ్యమవుతుందో కాదో అంటున్నాడు. అంతేకాదు ఈతరంలో కోహ్లి, స్టీవ్ స్మిత్ గొప్ప బ్యాటర్లంటూ లైయన్ కితాబిస్తున్నాడు.

