Dussehra Utsavalu 2024: దసరా ఉత్సవాల మూడవ రోజూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శమిస్తారు.. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది.
ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష చవితి రోజున కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని కూష్మాండదేవిగా పూజిస్తారు. అయితే విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని.. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరించి పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేధ్యంగా పరమాన్ణం, బూరెలు సమర్పిస్తారు.
Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!