Liquor Sales: అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా మద్యం షాపులు, మాంసం దుకాణాలు బంద్ అయ్యాయి. అదే రోజు దసరా పండుగ రావడంతో ముందురోజే వైన్ షాపులు, లిక్కర్ మార్టుల వద్ద భారీ రద్దీ కనిపించింది. అక్టోబర్ 1న మద్యం షాపుల ముందు క్యూ కట్టిన మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు.
ఎక్సైజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే కేవలం రెండు రోజుల్లోనే రూ.419 కోట్ల లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. పండుగ వాతావరణం, షాపుల బంద్ భయంతో సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు రెట్టింపయ్యాయి. బీరు అమ్మకాలు కూడా ఏరులై పారాయి. మూడు రోజుల్లోనే 6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి.
గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల
2024లో సెప్టెంబర్ నెలలో రూ.2838 కోట్ల మద్యం సేల్స్ నమోదవగా, 2025లో అదే నెలలో రూ.3046 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఏడు శాతం వృద్ధి చోటుచేసుకుంది.
-
2024లో 28.81 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడవగా, 2025లో ఈ సంఖ్య 29.92 లక్షలకు చేరింది.
-
బీరు అమ్మకాలు మాత్రం కాస్త తగ్గాయి. 2024లో 39.71 లక్షల కేసులు అమ్ముడవగా, 2025లో 36.46 లక్షలకు తగ్గాయి.
ఇది కూడా చదవండి: Cough Syrup Deaths: దగ్గుమందు తాగి 12 మంది చిన్నారులు మృతి.. నకిలీ మందులను ఎలా గుర్తించాలి
మూడు రోజుల్లోనే భారీ బిజినెస్
2025లో సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు, సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు రోజుల సేల్స్ 60% నుంచి 80% వరకు పెరిగాయని అధికారులు తెలిపారు.
మొత్తంగా
దసరా, గాంధీ జయంతి ఒకే రోజున రావడం వల్ల మద్యం షాపుల ముందు ముందురోజే రద్దీ బాగా పెరిగింది. ఈసారి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం ఎక్సైజ్ శాఖకు ఊరటనిచ్చింది. పండగ సీజన్‌లో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు సృష్టించాయి.