Pregnant Ladies: సాధారణంగా గర్భధారణ సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక తినడం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వారు ప్రతి పదార్థాన్ని తినడం సురక్షితమో కాదో తెలుసుకుని మరీ తింటారు. అయితే గర్భధారణ సమయంలో బెండకాయ తినవచ్చా లేదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అయితే గర్భిణీలు ఎంచక్కా బెండకాయ తినొచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ బెండకాయలోని కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు గర్భిణీలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శిశివు అభివృద్ధికి..
బెండకాయలోని విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి9 అనే పోషకాలు గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి9 పిల్లల మెదడు అభివృద్ధికి చాలా మంచిది.
మలబద్ధకం నుంచి రిలీఫ్ :
గర్భధారణ సమయంలో మలబద్ధకం ఒక సాధారణ సమస్య. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు వారానికి రెండుసార్లు బెండకాయ తింటే మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
వెన్నునొప్పి ఉపశమనం:
గర్భధారణ సమయంలో ఎముకలు బలహీనపడటం వల్ల వెన్నునొప్పి, ఇతర అవయవాలలో నొప్పి వస్తుంది. బెండకాయలో ఉండే విటమిన్ కె, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆకలి నియంత్రణ:
బెండకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ గర్భిణీ స్త్రీలు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనివల్ల బరువు పెరగడం కూడా తగ్గుతుంది. గర్భధారణ సమయంలో, ఉదయం తల తిరగడం, అలసట, వికారం వంటి సమస్యలు ఉంటాయి. బెండకాయ తినడం వల్ల అలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
రక్తహీనత నివారణ:
గర్భధారణ సమయంలో బెండకాయ తినడం చాలా మంచిది. దీనిలోని ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. పిల్లల అభివృద్ధికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో బెండీ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
ఇతర ప్రయోజనాలు:
గర్భిణీల రోగనిరోధక శక్తిని పెంచడానికి బెండకాయ సహాయపడుతుంది.
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు గర్భిణీ స్త్రీల విటమిన్ సి అవసరాన్ని తీరుస్తుంది.
బెండకాయలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మధుమేహం ఉన్న గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.
సూచన
బెండకాయ కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. అలాంటి వారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బెండకాయ తినాలి.