Nampally: హైదరాబాద్ లో ఘోరం జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. ఘటన పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Nampally: కాగా, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొలుపుతారు. గురువారం రాత్రి దాండియా ప్రోగ్రాం పూర్తి అయ్యే వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లొనే ఉన్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దుండగులు అర్ధరాత్రి టైంలో ఎవరూ లేరు సమయంలో మొదటగా కరెంట్ కట్ చేసి,సీసీ కెమెరాలు విరగగొట్టిన అనంతరం విగ్రహం చేతిని విరగకొట్టి, పూజ సామాను అంత చుట్టూ పడవేసి, అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్ కూడా తొలగించారు.
Nampally: ఘటనపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి