Dulquer Salmaan: లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తుంటాడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు.
Also Read: Rajinikanth: సైమన్ ను ఆకాశానికెత్తేసిన దేవా
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ హీరోగా చెయ్యబోయే తెలుగు చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో మీద తీసిన ముహూర్తం షాట్ కి నాని క్లాప్ నివ్వగా.. డైరెక్టర్స్ బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల గెస్టులుగా వచ్చి.. టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు. జీవీ ప్రకాష్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. దుల్కర్ నటిస్తున్న 41వ సినిమా ఇది. ప్రొడ్యూసర్ కి 10వ సినిమా..ఇవాళ్టి నుండే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీతో రవి నెలకుడితి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేయనున్నారు..
The much awaited #DQ41 – a heartwarming contemporary love story – launched grandly with a pooja ceremony ✨❤️🔥
Natural Star @NameisNani gave the clap & blockbuster directors @odela_srikanth & @BuchiBabuSana graced the event to bless the team.
Starring @dulQuer 🌹
Directed by… pic.twitter.com/8w0BihMnxm— SLV Cinemas (@SLVCinemasOffl) August 4, 2025