Lokah Chapter-1: సూపర్ హీరో జానర్ లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. అదే లోకా ఛాప్టర్ 1-చంద్ర.. దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి, హీరోయిన్ కి సూపర్ హీరో పవర్స్ ఎలా వచ్చాయి?..
కళ్యాణి ప్రియదర్శన్, ప్రేమలు ఫేమ్ నస్లేన్ మెయిన్ లీడ్స్ గా.. డామ్నిక్ అరుణ్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్.. లోకా ఛాప్టర్ 1-చంద్ర.. నిమిషం, 29 సెకన్ల టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేలా, హాలీవుడ్ స్టైల్లో ఉంది. హీరో భయంగా ఓ టవర్ ముందు నిలబడడం, సూపర్ హీరో పవర్స్ ఉన్న కళ్యాణి.. రెప్పపాటులో ఫీట్స్ చెయ్యడం, విజువల్స్, గ్రాఫిక్స్, ఆర్ఆర్ బాగా కుదిరాయి. ఓనమ్ పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చెయ్యబోతున్నారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ కానుంది..