Dude OTT: ప్రదీప్ రంగనాథన్, నేహా శెట్టి, మమిత బైజు నటించిన ‘డ్యూడ్’ దీపావళి హిట్‌గా నిలిచింది. 100 కోట్లు దాటిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మిస్ అయినవారు చూడొచ్చు.
Also Read: Sharwanand: శర్వానంద్ ఎనర్జీకి ఫిదా అయిన అభిమానులు?
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, నేహా శెట్టి, మమిత బైజు హీరోయిన్స్‌గా దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన ‘డ్యూడ్’ దీపావళి బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. మంచి బజ్‌తో రిలీజ్ అయి తెలుగు, తమిళ ప్రేక్షకుల అంచనాలు నెరవేర్చింది. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. థియేటర్స్ నుంచి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్‌లో మిస్ అయినవారు డెఫినెట్‌గా చూడొచ్చు. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీలో మరింత పాపులారిటీ సాధిస్తుందని అంచనా.

