Dude: ప్రదీప్ రంగనాథన్ వరుసగా మూడు సినిమాలతో 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లవ్ టుడే, డ్రాగన్, ఇప్పుడు డ్యూడ్ సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఇలా తమిళ, తెలుగులో ప్రదీప్ తన మార్కెట్ గట్టిగా సెట్ చేసుకుంటున్నాడు. అయితే తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ లేకుండా తన సినిమాలు ఈ మార్క్ దాటేవి కావని చెప్తున్నాడు. ఈ కామెంట్స్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి.
Also Read: The Girlfriend Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్
యువ హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలు సాధిస్తున్నాడు. లవ్ టుడే తో ప్రారంభమైన ఈ జోరు డ్రాగన్ నుంచి ఇప్పుడు డ్యూడ్ తో కొనసాగుతున్నది. డ్యూడ్ తో మూడో 100 కోట్ల గ్రాస్ సాధించి తన సత్తా ఏంటో నిరూపించాడు. తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ ఈ విజయాలకు కీలకం అని ప్రదీప్ అన్నాడు. ఈ మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ఆదరణ లేకుండా 100 కోట్లు దాటేవి కావని ఈ హీరో ఒప్పుకున్నాడు. ఈ క్రెడిట్ తెలుగు ఆడియెన్స్‌కు ఇస్తున్నాడు. ఈ కామెంట్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరి డ్యూడ్ ఇంకా ఎంత వరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

