డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ ఈరోజు ఉదయం వెల్లడించింది. తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లకు అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. మొదట ఈరోజు కౌన్సిలింగ్ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఉదయం వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ ఇవాళే అని వెల్లడించింది.