Weight Gain: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, మరికొందరు మాత్రం సరైన బరువు లేక, నీరసంతో ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం, ఒత్తిడి వల్ల వచ్చే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మార్కెట్లో దొరికే మందుల కంటే మన ఇంట్లో దొరికే సహజ ఆహారమే ఎంతో మేలు. ముఖ్యంగా ఎండు ఖర్జూరం ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఒక అద్భుతమైన మార్గం.
శక్తికి నిలయం – ఖర్జూరం: బరువు పెరగాలనుకునే వారికి ఎండు ఖర్జూరం ఒక వరమని చెప్పవచ్చు. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. రసాయనిక పౌడర్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఖర్జూరం వంటి సహజ సిద్ధమైన ఆహారం వల్ల శరీరానికి ఏ హానీ కలగదు.
ఇది కూడా చదవండి: Gold & Silver Rate: దెబ్బకు లక్ష తగ్గిన ధరలు.. బంగారం తులం ధర ఏంటంటే?
ఖర్జూరంలోని పోషకాలు: ఖర్జూరంలో కేవలం కేలరీలు మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి:
-
కాల్షియం: ఇది మన ఎముకలను దృఢంగా మారుస్తుంది.
-
ఐరన్: రక్తహీనతను తగ్గించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
-
ఫైబర్: తిన్న ఆహారం త్వరగా అరిగి, ఒంటికి పట్టేలా చేస్తుంది.
-
పొటాషియం: గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు పెరగడానికి ఎలా ఉపయోగించాలి? ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకోవడం అత్యుత్తమ పద్ధతి. రాత్రిపూట కొన్ని ఎండు ఖర్జూరాలను ఒక గ్లాసు పాలలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ ఖర్జూరాలను తింటూ, ఆ పాలను తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కండరాలు దృఢంగా మారి, సహజంగా బరువు పెరుగుతారు.
ఖరీదైన మందులు, జిమ్ సప్లిమెంట్ల జోలికి వెళ్లకుండా, ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పద్ధతులను పాటిస్తే బరువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
