Viral News

Viral News: తప్ప తాగి.. అన్నంలో కాళ్లు పెట్టి పడుకున్న వాచ్‌మెన్‌

Viral News: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో జరిగిన ఒక విస్తుపోయే సంఘటన విద్యార్థులను, అధ్యాపకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. విద్యార్థులకు భోజనం అందించాల్సిన వాచ్‌మెన్, పూర్తిగా మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించాడు.

అన్నం పాత్రలోనే కాళ్ళు పెట్టి నిద్రపోయాడు

బుధవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు విద్యార్థులు హాస్టల్‌లోని వంటగదికి చేరుకోగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. విద్యార్థులకు పంపిణీ చేయడానికి వండిన అన్నం ఉన్న పెద్ద పాత్ర (బాన)లో కాళ్ళు పెట్టి నిర్రపోతున్నాడు మద్యం మత్తులో ఉన్న అతడిని చూసి ఆశ్చర్యపోయారు విద్యార్థులు.

ఇది కూడా చదవండి: Anirudh-Kavya Maran: కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌.. మ‌ళ్లీ ట్రెండ్‌లోకి..!

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ లో చోటుచేసుకుంది. మిట్టా మధ్యాహ్నం హాస్టల్ వాచ్‌మెన్ ఫుల్ గా తాగేసి కిచెన్ లో గిన్నెలు మధ్యలో నిద్రపోయాడు. పక్కనే ఉన్న ఇతర సిబ్బంది ఎంత ప్రయత్నించినా అతను మత్తు వీడలేదు. పంపిణీ చేయాల్సిన అన్నం లో కళ్ళు పెట్టడం తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

వీడియో వైరల్.. తక్షణ తొలగింపు

ఈ దారుణమైన సంఘటనను విద్యార్థులు, అధ్యాపకులు తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విద్యార్థులకు కడుపు నింపాల్సిన చోట ఇంతటి నిర్లక్ష్యం, అపరిశుభ్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

విషయం తెలుసుకున్న కళాశాల పై అధికారులు వెంటనే హాస్టల్‌కు చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని సదరు వాచ్‌మెన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట వాచ్‌మెన్ చేసిన ఈ నిర్వాకం పట్ల అధికారులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హాస్టళ్లలో భద్రతా సిబ్బంది నిర్వహణ, వారిపై పర్యవేక్షణ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఈ సంఘటన మరోసారి హెచ్చరించింది.

[video_player file=”https://mahaanews.co.in/wp-content/uploads/2025/11/WhatsApp-Video-2025-11-14-at-11.54.30-AM.mp4″]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *