Drumstick

Drumstick: మునక్కాయలు ఎవరెవరు తినకూడదో తెలుసా?

Drumstick: సాధారణంగా మునగకాయలను ప్రొటీన్లకు, పోషకాలకు నిలయంగా భావిస్తారు. చలికాలంలో ఇవి మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వలన అనేక వ్యాధులకు ఇవి ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు. అయితే, అన్ని కూరగాయల మాదిరిగానే, మునగకాయలకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మానుకోవాలని లేదా చాలా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్భిణులు దూరంగా ఉండాలి: ముఖ్యంగా గర్భంతో ఉన్న స్త్రీలు మునగకాయను అస్సలు తినకూడదు, ఎందుకంటే దీనిని అధికంగా తీసుకోవడం వలన గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తల్లిపాలు ఇచ్చే తల్లులు కూడా మునగకాయ వంటకాలకు దూరంగా ఉండటం మంచిది. అధిక రక్తస్రావ సమస్యలు ఉన్న మహిళలు కూడా మునగను ఎక్కువగా తినకూడదు.

Also Read: Winter Tips: చలికాలంలో పగిలిన మడమల సమస్యకు ఇంటి చిట్కాలతో పరిష్కారం

బీపీ, గుండె సమస్యలు ఉన్నవారికి: మునగకాయలలో ఉండే ఆల్కలాయిడ్ అనే పదార్థం గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించగలదు. దీని కారణంగా గుండె జబ్బులతో బాధపడేవారు మునగకాయ తింటే, వారికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అలాగే, మునగకాయలు రక్తపోటును తగ్గిస్తాయి కాబట్టి, తక్కువ రక్తపోటు (Low BP) ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే ఉత్తమం.

జీర్ణ సమస్యలు, అలెర్జీలు: గ్యాస్ట్రిక్, కడుపు అల్సర్లు లేదా సరిగా ఉడకని మునగకాయలు తినడం వలన గ్యాస్, డయేరియా వంటి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, హైపర్ సెన్సిటివిటీ (తీవ్ర అలెర్జీ) సమస్య ఉన్నవారు మునగకాయలు తింటే, వారికి శరీరమంతటా చికాకు లేదా వాపు వంటి ప్రమాదకరమైన అలెర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా మునగకాయలను తినడం తగ్గించాలని లేదా నిపుణుల సలహా తీసుకోవాలని సూచించబడుతోంది, ఎందుకంటే ఇది థైరాయిడ్ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.

Note: ఈ ఆరోగ్య సూచనలు కేవలం నిపుణుల అభిప్రాయం ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఆరోగ్య పరమైన ఏ సమస్య ఉన్నా, సొంతంగా నిర్ణయం తీసుకోకుండా తప్పనిసరిగా వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *