Drugs: బెంగళూరులోని ఆర్డీ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఇంట్లో మాదకద్రవ్యాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు సీసీబీ నార్కోటిక్స్ కంట్రోల్ పోలీసులకు సమాచారం అందింది. తెల్లవారుజామున 1:00 గంటలకు పోలీసులు ఆ ఇంటిని సోదా చేశారు.
ఈ తనిఖీలలో ఒక అల్మారాలో నిల్వ ఉంచిన హెరాయిన్, MDMA, మాత్రలు, హాషిష్ ఆయిల్ సహా 60 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను వారు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి ఇమ్రాన్ హుస్సేన్ (35) అరెస్టు చేశారు.
అతను అస్సాం, నాగాలాండ్ నుంచి తక్కువ ధరలకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఎవరున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: Flight Crash: అమెరికాలో రెండు విమానాలు ఢీ.. ఏమి జరిగిందంటే…