హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రెండు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. హెచ్ న్యూ పోలీస్ ఆపరేషన్లో డ్రగ్స్ పెడ్లర్స్ పట్టుబడ్డారు. విదేశీయుడు సహా ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకున్నారు. హుమాయిన్ నగర్లో 50 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. కంచన్ బాగ్లో 80 గ్రాములMDMA, 10 గ్రాముల LSD స్వాధీనం చేసుకున్నారు. రూ.20.75 లక్షల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
