Drug Bust: మరికొన్నిరోజులో న్యూ ఇయర్ రానుంది దింతో నగరంలో మాదకద్రవ్యాల కలకలం రేగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, నిఘా పెంచుతున్నా.. కేటుగాళ్లు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు రట్టు చేశారు.
విద్యా సంస్థలే అడ్డాగా విక్రయాలు
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్‌కు ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పెడ్లర్లు బెంగుళూరు నుంచి అక్రమ మార్గాల్లో డ్రగ్స్‌ను నగరానికి తరలిస్తున్నారు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే.. ఒక ప్రైవేట్ పాఠశాల సమీపంలో ఈ విక్రయాలు జరుగుతుండగా పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఐదుగురు వినియోగదారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుల జాబితాలో విద్యావంతులు
ఈ కేసులో పట్టుబడ్డ వారి ప్రొఫైల్స్ చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. సమాజంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నవారు కూడా ఈ మత్తు ఊబిలో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు
మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ముగ్గురు టెక్కీలు. వీరితో పాటు ముగ్గురు ప్రధాన పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
భారీగా స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు, సుమారు 70 గ్రాములు (మార్కెట్ విలువ రూ. 4 లక్షలు). డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న రెండు కార్లు.
న్యూ ఇయర్ పార్టీల కోసం బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యువత, విద్యావంతులు ఇలాంటి వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంపై పోలీసులు డేగ కన్ను వేశారు. పబ్‌లు, ప్రైవేట్ రిసార్టులు, ఫామ్ హౌస్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ పోలీసులు స్పష్టం చేశారు.
