Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (నవంబర్ 20) తిరుమల-తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3.25 గంటలకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మొదట తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ సుమారు 3.55 గంటలకు పద్మావతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Droupadi Murmu: ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల చేరుకుంటారు. అక్కడి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. మరునాటి ఉదయం అంటే శుక్రవారం (నవంబర్ 21) నాడు శ్రీ వరాహస్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకే తిరుమల ఆలయంలో శ్రీ వారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజారులు వేదాశీర్వచనం పలుకుతారు.
Droupadi Murmu: ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఇదిలా ఉండగా, ఇటీవలే రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. మాల ధరించిన ఆమె ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకతను చాటుకున్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకున్న రెండో రాష్ట్రపతిగా ఆమె చరిత్ర స్పృష్టించారు.

