Janasena Office: శనివారం మంగళగిరిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయం మీద గుర్తుతెలియని డ్రోన్ ఎగిరిన విషయం తెలిసిందే.. దింతో జనసేన కార్యకర్తలు పోలీస్ లకి పిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మంగళగిరి డీఎస్పీ, జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్ నేతృత్వంలోని ఇతరులు ఆ రోజు జనసేన కార్యాలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తును వేగవంతం చేయడానికి ఆదివారం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు డ్రోన్ల విక్రేతలు, కొనుగోలుదారులు, వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నాయి. ఆదివారం వరకు ఈ విషయంలో ఎవరు పాల్గొన్నారో స్పష్టంగా తెలియలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.