Drishyam 3: దృశ్యం సిరీస్‌లో మూడో భాగం తయారవుతుంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్త థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను పనోరమా స్టూడియోస్ కొనుగోలు చేసింది. ఈ డీల్ 100 కోట్లకు పైగా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ అసాధారణ ఆఫర్ దృశ్యం 3పై ఉన్న అంచనాలను స్పష్టం చేస్తోంది.
Also Read: Bheemavaram Balma: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న భీమవరం బల్మా పాట!
దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని సాధించాయి. ఈ ప్రాంఛైజీలో మూడో భాగం ప్రస్తుతం మలయాళంలో చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను ఆశీర్వాద్ మూవీస్ పనోరమా స్టూడియోస్‌కు విక్రయించింది. ఈ డీల్ 160 కోట్లకు క్లోజ్ అయినట్లు సినీ వర్గాల సమాచారం. పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని మలయాళం, హిందీలో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే హిందీలో ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో విడుదల కొంత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. మరోవైపు తెలుగు దృశ్యం 3లో వెంకటేశ్ నటించబోతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. దీని కారణంగా దృశ్యం 3 షూటింగ్ తప్పనిసరిగా ఆలస్యం కావచ్చు. ఈ భారీ డీల్ దృశ్యం 3పై ఉన్న అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది.
